బహుముఖ ప్రజ్ఞాశాలి సావిత్రిబాయి

బహుముఖ ప్రజ్ఞాశాలి సావిత్రిబాయి పూలే తొలి మహిళా ఉపాధ్యాయునిగా, సామాజిక విప్లవకారిణిగా, సాహితీవేత్తగా,నాయకురాలిగా, సంఘసంస్కర్తగా అందరి హృదయాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా సావిత్రిబాయి పూలే నిలిచారని జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పెద్దూరు సామాజిక వికాస కేంద్రంలో సావిత్రి భాయ్ పూలే 124 వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. భారతదేశంలో తొలి పాఠశాలను స్థాపించి విద్యకు దూరమైనా ఎంతోమంది బడుగుబలహీన వర్గాలు, మహిళలకు విద్యను అందించిన ఘనత ఆమేదేనన్నారు. సత్య సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి ఎందరో జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. సామాజిక దురాచారాలతో కొంతమందికి మాత్రమే పరిమితమైన విద్యను అందరికీ చేరువ చేసి అందరిని సాధికారత దిశగా నడిపించారని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే పేరిట విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యకు, పరిశోధనలకు అవకాశం కల్పించాలని కోరారు. సావిత్రి బాయ్ పూలే పేరిట ఉపకార వేతన నిధిని ఏర్పాటు చేసి చదువులో బాగా రాణించే బాలికలకు ప్రోత్సహించాలని కోరారు. ఆమె జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించిన గండికోట ఆ మహోన్నతురాలు మనకందించిన సాధికారత,ఆత్మవిశ్వాసం, చైతన్య స్ఫూర్తితో ముందడుగు వేసి రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏనాడైనా అనుకున్నామా..!

 విశాల  గగనాన్ని రెక్కులు  చేసికొని ఎగిరే పిట్టలన్నీ
ఇంటి తల్లి ఒడిలో ముణగదీసి పడుకొన్న చంటిపిల్లల  వైనం
రాజ్యాలనే  జయించిన విశ్వవిజేత
ఒక పురుగు కోరల్లో చిక్కుకొన్న విషాదం
సీతాకోక చిలుకలు  వాలని పాఠశాలలు  
నర సంచారం లేని కార్యాలయాలు
శబ్దమృదంగాలు  మోగని రహదారులు
ఏనాడైనా కలగన్నామా  ఇలాంటి రోజులు  వస్తాయని
ఆఫీసంటూ బజారంటూ కాళ్లకు చక్రాలు  కట్టుకు తిరిగే నిరంతర చలనశీలి
కాళ్లు కట్టేసినట్లు ఒక్కచోటే బిక్కుబిక్కుమంటూ కూలబడిన వాస్తవం
చేతిలో కరవైన రూపాయిలు , ఉపాథి లేని వలస కూలీలు
తోటి ప్రాణులతో సాహచర్యం చేయాల్సినవాడు
తన చుట్టూ పెంచుకున్న స్వార్థం పుట్టలో జీవిస్తూ బయటకు రాలేక
సాటివారికి మరణశాసనం రాస్తూ పిట్టల  గొంతు నులిమి
మట్టి పుస్తకాలు  చించి కాంక్రీటు కంపూటర్లను కౌగిలించుకొని
నదులను కాలుష్య చిరునామాలుగా మార్చిన మానవుడా
భయాన్ని జయించు ముందు
కరోనా సైతం దిగివచ్చి నిలుస్తుంది నీ ముందు 
అపుడు భాయీభాయీ అంటూ
ఒకరి భుజాల పై ఒకరు చేతులు  వేసి….బృందగానమై సాగిపోదాం…

 – మందరపు హైమవతి

వాట్సాప్ నెంబరు ….7396902214

ఫాతిమా షేక్ ఉద్యమ చరిత్ర

ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ ఉద్యమ చరిత్రను వివరిస్తూ ” ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ ” చరిత్ర గ్రంధాన్ని  మార్చి 10న రెండు తెలుగు రాష్ట్రాలలో 150 ప్రాంతాలలో ఆవిష్కరిస్తున్నట్టు ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ వెల్లడించారు. శుక్రవారం నాడు పిడుగురాళ్ల లోని నాని పారడైస్ లోని తన నివాసంలో ఆయనను కలసిన విలేఖరులతో బహుగ్రంథకర్త నశీర్ మాట్లాదారు. శ్రీమతి సావిత్రి బాయి 127వ  వర్ధంతి సందర్భంగా  ఈ పుస్తకాన్ని  ఆవిష్కరించి ఆసక్తి గల పాఠకులకు వదాన్యుల చిరుకానుకగా అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ పుస్తకం  మహాత్మ జోతిరావు ఫూలే , శ్రీమతి సావిత్రి బాయి ఫూలే ల తో కలసి 170 సంవత్సర క్రితం ” భేటి పడావ్  ” ఉద్యమానికి నాంది పలికిన ఫాతిమా షేక్ మీద  భారతదేశం లో  వెలువడిన మొట్టమొదటి  గ్రంథమని అయన అన్నారు. మహాత్మ జోతిరావు ఫూలే , శ్రీమతి సావిత్రి బాయి ఫూలే లను ఫూలే తండ్రి గోవిందరావు ఫూలే తన ఇంటి నుంచి వెళ్లగొట్టినప్పుడు ఫూలే దంపతులకు తమ ఇంట ఫాతిమా షేక్, ఆమె అన్న ఉస్మాన్ షేక్ ఆశ్రయం కల్పించారని అయన వివరించారు. ఫాతిమా షేక్  మరాఠి భాష నేర్చుకుని సావిత్రి బాయి తో కలసి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొంది పూలే ప్రారంభించిన పాఠశాలల్లో ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా ఉచిత సేవలు అందించారని ఆయన చెప్పారు. ఆమె ఇల్లు ఇల్లు తిరిగి బాలికలను పాఠశాలకు పంపని తల్లి తండ్రులకు పిలుపునిచ్చారని నశీర్  అహమ్మద్ వెల్లడించారు. అంతటి  మహనీయురాలి మీద గ్రందం రాసే అవకాశం లభించినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ గ్రంధం 5000 ప్రతులను ప్రచురించడానికి చేయూత నిచ్చిన వదాన్యులులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకాన్ని, గ్రంధాలయాలకు, ఆసక్తి గల పాఠకులకు చేరవేయదానికి సహకరిస్తున్న వివిధ సాహిత్య సంస్థలకు, సేవా సంఘాలకు,  సహచర సోదరులకు నశీర్ ధన్యవాదాలు తెలిపారు. ఆసక్తి గల సంస్థలు, వ్యక్తులు ఎవ్వరైనా తమ తమ ప్రాంతాలలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిపి ఆసక్తి గల పాఠకులకు, గ్రంధాలయలకు అందజేయడానికి సిద్ధమైనట్టయితే పుస్తకాలను ఉచితంగా అందివ్వడానికి తాము సిద్ధమని ఆయన చెప్పారు. ఈ విషయమై ఆసక్తి గల వ్యక్తులు + 91 9440241727 కు సంప్రదించాల్సిందిగా సయ్యద్ నశీర్  అహమ్మద్ ఆహ్వానించారు

దేవి ప్రియ కవిత్వంలో అరుదైన ప్రతీకలు by Bikki krishna

దేవి ప్రియ కవిత్వంలో అరుదైన ప్రతీకలు దర్శనమిస్తాయి.’అమ్మచెట్టు’ ‘తుఫాను తుమ్మెద’ ‘చేపచిలుక’ ‘గంధకుటి’ ‘గాలిరంగు’ ‘అరణ్యపురాణం’ లాంటి పదబంధాలు ఆయన కవితాసంపుటాల శీర్షికలై దేవిప్రియను ఇతరకవులకు భిన్నమైన కవిగా నిలబెట్టాయి.ఆయన కవితా నిర్మాణం అత్యంత సరళమై,objective co -rellation తో ,కొన్ని చోట్ల పేరడాక్స్,అలిగొరి,కన్సీట్ పొయేట్రీ డెవిసెస్ ఛాయలతో..సరికొత్త ఇమేజరీతో తాత్వికత ,భావుకత,అభివ్యక్తి నవ్యతల కలనేతగా నిరలంకారకవితా రూపంలో అద్భుత కవితాశిల్పమై అలరారింది.దేవిప్రియగారి నిరాడంబర జీవితం ఆతని కవిత్వతత్వమై ఒక తాత్విక భూమికగా మారింది.స్థల కాలాదులు,ప్రజా ఉద్యమాలు,మానవ విలువలు మృగ్యమైపోవడం,సమకాలీన రాజకీయాల్లోకి డొల్లతనం ప్రవేశించడం,ప్రపంచవ్యాప్తంగా వచ్చిన లిబరలైజేషన్,గ్లోబలైజేషన్,హిందుత్వమతశక్తుల విజృంభణ,మతాల మారణ హోమాలు ఇత్యాది అమానవీయ విషాద దృశ్యాల సమాజసంక్షోభాలన్నీ దేవిప్రియ కవిత్వంలో వస్తుశిల్పాలై ఒక ప్రత్యేక కవితాశిల్ప రామణీయతకి,అపూర్వ అభివ్యక్తి వైచిత్రికి కారకాలయ్యాయి.

దేవిప్రియ జీవితం పూలబాట కాదు.అలా అని అది పూర్తీ ముళ్ళబాట కాదు.పూలు,ముళ్ళు ,రాళ్ళు కలగలిసిన విచిత్ర అనుభవాల అనుభూతుల అతుకుల గతుకుల బతుకుబాట. దశాబ్దాల కవిత్వవ్యాసంగం,అలుపెరుగని జర్నలిజంతో ముడిపడిన ఒక చేతన్య ప్రవాహం ఆయన జీవితం.ఎక్కడో గుంటూరు జిల్లాలో 1949 ఆగస్టు 15 న జన్మించిన దేవిప్రియ గారు జీవితంలో పేదరికం,కష్టాలు నష్టాలు ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసారు.ఆ క్రమంలోనే ఒక అద్భుత కవిగా పరిణామం చెందారు.

“చూడండి

నేను నా ప్రజలతో నిర్మించబడ్డ కవిని”

అని నిరహంకారంగా చెప్పుకున్న ఈ కవి…

“దేవతలకి స్వర్ణకలశాలతో

పంచామృతాలతో అభిషేకాలు చేశాం

కాని సోదరా..

మనిషి మాలిన్యాన్ని

ఇన్ని నులివెచ్చని కన్నీళ్ళతో

కడిగి శుభ్రం చేయలేకపోయాం”

అంటూ బాధపడిన ఒక మానవతా మూర్తి దేవి ప్రియగారు.

“కవిత్వం నన్ను పట్టుకుంది.మిగిలినవి నన్ను కవిత్వంలా పట్టుకోలేక పోయాయి” అంటూ ‘అవసరాల నిమిత్తమే నేను పత్రికల్లో పనిచేశానని చెప్పుకున్న నిజాయితీ ,నిష్కళంక కవి ఆయన.పత్రికల్లో నిరంతరం టెంక్షన్ వాతావరణంలో పని చేస్తూ అద్భుత కవిత్వం రాయడం అసిధారావ్రతం అని ఎందరికి తెలుసు?అయినా దేవిప్రియ గారు ప్రజావాహిని,నిర్మల,ప్రజాతంత్ర,మనోరమ,ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి,ఉదయం,హైదరాబాద్ మిర్రర్,హెచ్.యం.టి.వి,10టి.వి ల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూనే ..ఎన్నోకవితా సంపుటాలు , గ్రంథాలు ఆవిష్కరించారు. అమ్మచెట్టు(1979)నీటిపుట్ట(1990),తుఫాను తుమ్మెద(1999),పిట్టకూడా ఎగిరిపోవలసిందే(2001),చేప చిలుక(2005),ఎందుకుంటుంది(2009),గాలి రంగు(2011)ఇలా ఎన్నొ అపూర్వ,అద్భుత కవితా సంపుటాలు వెలువరించారు.’గాలి రంగు’ కవితా సంపుటికి 2017 లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది.దేవిప్రియగారు రాసిన “సమాజానంద  స్వామి”(1977),””రన్నింగ్ కామెంటరీ”(మూడు సంపుటాలు)జర్నలిస్టుగా దేవిప్రియ సత్తా ఏమిటో నిరూపించిన రచనలు.ఆయనలో ఉన్న సున్నిత హాస్య ,వ్యంగ్య,చమత్కార చతురతను పలు కోణాల్లో ఆవిష్కరించిన గ్రంథాలవి.

జయహో సంస్థల సేవా కార్యక్రమాలు

జయహో సంస్థల ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ అయోధ్య నగర్ లో జరిగింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు . అందులో  లో భాగంగా  ప్రతి ఆదివారం ఒక సేవా కార్యక్రమం రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు ఆహారం , బియ్యం పంపిణీ ఏం చేస్తున్నారు . కార్తీకమాసం సందర్భంగా పండ్లు పేద ప్రజలకు పంపిణీ చేశారు . అంతేకాక కరోనా పై అవగాహన కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు పేద ప్రజలకు నగదు సహాయం కూడా చేశారు ఈ విధంగా నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి తమ వంతు సేవలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జయహో సంస్థ అధ్యక్షురాలు కొల్లా జయశ్రీ, కోశాధికారి ఆంజనేయరాజు సెక్రెటరీ విజయశ్రీ సాయి చందు పాల్గొన్నారు

వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి

 బనగానపల్లె మండలం పలుకూరు లోని స్థానిక రామాలయం నందు శ్రీ జెకెఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ j.s.s. బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి  ఉత్సవంలో పురస్కరించుకొని శ్రీ బ్రహ్మం గారి కాలజ్ఞాన విశిష్ట సదస్సును నిర్వహించడం జరిగినది ముందుగా శ్రీ జేఎసెస్ బ్రహ్మానంద చారి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటానికి పూలమాలవేసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధికి తోడ్పాటు అందించి రవ్వలకొండ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని బ్రహ్మం  గారి దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే ఒక్క జిల్లాకి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి జిల్లా నామకరణం చేయాలని ఒక యూనివర్సిటీ కి ఆయన పేరు పెట్టాలని బ్రహ్మం గారి జయంతి ఆరాధనలు ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టాలని విద్యార్థులకు స్వామి వారి చరిత్ర ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తన కాలజ్ఞానం  ద్వారా జ్ఞాన బోధ చేశారని మూఢనమ్మకాలు మూఢవిశ్వాసాలను గుడ్డిగా నమ్మవద్దని బోధించారు కుల మత భేదాలు వద్దని బోధించారు తాగుడు జూదం మంచిదికాదని చెప్పారని  విద్య  అందరి లక్ష్యం కావాలని అందుకే కాలజ్ఞానం అందరికీ ఆదర్శం అన్నారు ఆంజనేయస్వామి భక్త సంఘం అధ్యక్షుడు   కెయివెంకటసుబ్బయ గౌడు మాట్లాడుతూ నాలుగు వందల ఏళ్ల క్రితమే విద్యుత్ రైళ్లు విమానాలు భవిష్యత్తులో వస్తాయని తెలిపారు బాల సరస్వతి భజన మండలి అధ్యక్షుడు బాల హనుమంతు మాట్లాడుతూ భూత భవిష్యత్ వర్తమానం తెలిపిన దేవదేవుడిని వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం ద్వారా సమాజం జ్ఞానబోధ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో కె ఈ వెంకటసుబ్బయ్య హనుమంతు ఆంజనేయ స్వామి భక్త బృందం బ్రహ్మంగారి భక్త బృందం పాల్గొన్నారు అనంతరం భజన కార్యక్రమం నిర్వహించారు

ప్రపంచస్థాయి రాజధాని

ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశలో బ్లూప్రింట్‌ను సిద్దం చేసింది. జపాన్‌ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్లూప్రింట్‌లోని కీలక అంశా లను అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించ నున్నారు. ఈ బ్లూప్రింట్‌లో పేర్కొన్న వివరాల ప్రకా రం రాజధాని మహానగరాన్ని మూడంచెల్లో విస్తరించనున్నారు. కోర్‌కేపిటల్‌సిటి, గ్రీన్‌ఫీల్డ్‌సిటీ, మెట్రో పాలిటన్‌ రీజియన్‌గా మూడు భాగాలుగా మహా రాజధాని నగర నిర్మాణాన్ని ప్రభుత్వం విభజిం చింది. ప్రతి అంచెలోనూ ఒక రింగ్‌రోడ్డును నిర్మించనుంది. అంటే రాజధానిలో మూడు రింగ ్‌రోడ్డులు ఉంటాయి. 22 లక్షల ఎకరాల్టో చేపట్టనున్న మెట్రోపాలిటిన్‌ సిటీ చుట్టూ నిర్మించనున్న రింగ్‌రోడ్డు ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. 180 కిలోమీటర్ల పరిధిలో ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం సాగుతుందని, దీనికోసం సుమారుగా 31 వేల కోట్ల రూపాయలు (ఐదు మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) ఖర్చు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇదికాక, మూడంచెల మహారాజధాని ప్రాంతంలో నిర్మాణం కానున్న ఆకాశహర్మ్యాలు, ఎమ్యూజ్‌మెంటు పార్కులు, రోడ్లు, మెట్రో రైళ్లు,తాగునీటి సరఫరా తదితర మౌళికవసతులు, ఇతర సామాజిక సౌకర్యాల కోసం 1.25 లక్షల కోట్ల నుండి రెండు లక్షల కోట్ల రూపాయలు (20 వేల నుండి 30 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల) వరకు పెట్టుబడులు అవసరమవుతాయన్నది ప్రభుత్వ అంచనా!
ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. జపాన్‌ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. రానున్న దశాబ్ధకాలంలో రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు.

షిర్డీ సాయిబాబా

షిర్డీ సాయిబాబా (?? – అక్టోబర్ 15, 1918) భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు. ఇతని అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులూ సాధువుగా నమ్ముతారు. ఇతని జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.

సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు.[1] అతను హిందువా, ముస్లిమా, దేవుడా, గురువా, సామాన్యుడా అన్ని విషయాల గురించి పలు వాదాలున్నాయి.[2]
నేపధ్యం

అధికంగా కనుపించే సాయిబాబా చిత్రం
సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలున్నాయి.[3] తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవుసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో మరియు పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు మరియు వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు, బహుశా బాబా గారు అందుకే వారి పేరు మరియు పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకమారు తన ప్రియానుయాయుడైన మహాల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కధనం ఉంది.[4]. మరొకమారు ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు చెప్పాడంటారు.[5] ఈ రెండు కధనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి.

తన షుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత (షుమారు 1858లో) షిరిడీకి తిరిగి వచ్చాడనీ అత్యధికులు విశ్వసించే విడయం. ఈ ప్రకారం బాబా షుమారు 1838లో జన్మించి ఉండవచ్చును.

ఆ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు.[8]. మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబాను తరచు దర్శించసాగారు. అతడు పిచ్చివాడని మరి కొందరు రాళ్ళు కూడా రువ్వేవారు.[9]. మళ్ళీ కొంతకాలం కనుపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశాడని, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి అధ్వర్యంలో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చుననీ, కొంతకాలం నేత పని చేశాడనీ కొన్ని సూచనల వలన తెలుస్తున్నాయి.
షిరిడీలో నివాసం

తన మసీదు వరండాలో సాయిబాబా
1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చాడు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర అతను బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి “దయ చేయుము సాయీ” అని పిలిచాడు. తరువాత ‘సాయి’ పదం స్థిరపడి అతడు “సాయిబాబా”గా ప్రసిద్ధుడైనాడు.[11] షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి ‘మొహిదీన్ తంబోలీ’ అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే ‘కఫనీ’, తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టాడు. [12] ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.

1918లో తన మరణం వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నాడు. యాచన అతని వృత్తి. మసీదులో ధునిని వెలిగించాడు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవాడు. అది తమకు రక్షణ ఇస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవాడు. చాలా మహత్తులు చూపించేవాడని భక్తులు చెబుతారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవాడు. ఉత్సవాలలో పాల్గొనేవాడు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవాడు.[14][15]
1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాదువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు.[16] అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో కన్ను మూశారు (మహా సమాధి చెందారు). ఆయన దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే ‘సమాధి మందిరం’ నిర్మించబడింది.[17]
ముఖ్యమైన శిష్యులు, అనుయాయులు

సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవాడు. సకోరీకి చెందిన ఉపాసనీ మహారాజ్, అహమ్మద్ నగర్‌కు చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు.

శ్రీ సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయనను సదా అంటిపెట్టుకొని ఉన్నారు – వారిలో ముఖ్యులు: మహాల్సాపతి, హేమాండ్ పంతు, శ్యామా ,తాత్యా..
బోధనలు[మార్చు]

మసీదు గొడకానుకొని ఉన్న సాయిబాబా, భక్తులతోడుగా
తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించాడు. నమాజ్ చదవడం, అల్-ఫతీహా మననం, ఖొరాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించాడు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.[18] ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించాడు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించాడు.[19] తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పాడు. ప్రార్ధన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం – వీటిని ప్రోత్సహించాడు. ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించాడు.[20] నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పాడు. తన భక్తులకు రెండు ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పాడు – అవి శ్రద్ధ (విశ్వాసం, భక్తి, దీక్ష), సబూరి (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టాడు[21]. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించాడు.

రెండు మతాల గ్రంధాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించాడు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని ఆయనతో ఉన్నవారు చెప్పారు. హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి.[22] తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నాడు[6].

భగవంతుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. అతని ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమనీ, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమనీ చెప్పాడు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించీ, గురువునే దేవుడిగా భావించమనీ పదేపదే చెప్పాడు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పాడు.
సాయిబాబా రచించిన గ్రంధాలేవీ లేవు. అతని బోధనలు మౌఖికంగానే శిష్యులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు. సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘దక్షిణ’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవాడు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవాడు. భక్తులవద్ద దక్షిణ తీసికొని వారి పూర్వ ఋణాలను చెల్లించడానికి దోహదం చేస్తాడని అతని అనుయాయులు అనేవారు.
దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం – ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు అని బాబా అనేవాడు. దగ్గరకు వచ్చినవారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవాడు. “దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాసం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారియెడల కుక్కలాగా మొరగవద్దు” అని చెప్పాడు.[23]

బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని ప్రసిద్ధ వాక్యాలు – “నేనుండగా భయమెందులకు?”[24]“అతనికి మొదలు లేదు… తుది లేదు “,[24]. తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.:
Shirdi Sai Baba.jpg
షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.
నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవుసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
నా సమాధినుండి నేను మాట్లాడుతాను.
నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.
మీరు నావంక చూడండి. నేను మీవంక చూస్తాను.
మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.
మత సామరస్యం[మార్చు]

“ హిందువుల దైవమైన శ్రీ రాముడు, ముస్లిం ల దైవమైన అల్లా ఒక్కరే ! ఇరువురి బోధనల సారాంశం ఒక్కటే – అందరి దైవం ఒక్కరే ! కనుక మీలో మీరు కలహించుకోవడం మాని సోదరుల వలె కలిసి మెలిసి జీవించండి.”
సర్వాంతర్యామి అయిన ఆ భగవంతునిని సేవించుటకు మత బేధం ఆటంకం కాకూడదు
ఒక ముస్లింకు సంతానం కలిగితే శిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. సాయి అతనిని అల్లా అచ్చా కరేగా అని దీవించారు. కొంత కాలానికి అతని కోరిక ఫలించి కొడుకు పుట్టాడు.”వెళ్ళి మారుతీ ఆలయం లో మిఠాయి పంచు” అన్నారు.మారుతీ ఆలయం లో మిఠాయి పంచి తిరిగి సాయి వద్దకు రాగా ఆయన ఎంతో ఆనందంతో అతనిని కౌగలించుకొని అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు.
“అందరి దైవం ఒక్కరే. మతం అనేది ఆ దైవాన్ని చేరుకునే ఒక మార్గం మాత్రమే”.
“ఖురానును చదవగానే సరి కాదు, అందులోని సారాంశాన్ని వంట పట్టించుకొని ఆచరించాలి.”
భక్తులు, పూజా విధానాలు[మార్చు]

మఛిలీపట్నంలో సాయిబాబా మందిరం
ఖండోబా ఆలయంలోని పూజారి మహాల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి. తరువాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు, విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరి కొద్దిమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును. 1910 తరువాత ఒక భక్తుడైన దాసగణు తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు. అప్పటినుండి దేశంలో చాలా ప్రాంతాలనుండి హిందూ, ముస్లిమ్ భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రాసాగారు. బాబా జీవిత కాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ, పార్శీ భక్తులు కూడా షిరిడి సాయి దర్శనానికి రాసాగారు.[1]

షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.
దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ సాయిబాబా మందిరాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్…లో అనెక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి.[1] సాయి బాబా గురించి అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి.[25] హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింపబడుతున్నది.[26] అయితే సాయిబాబా ఆరాధనోద్యమంలో కొద్దిపాటి మాత్రమే షిరిడి సాయి సంస్థానం మార్గదర్శకత్వ వ్యవస్థలో ఉంది. అధికంగా భక్తులు, పూజలు, ఆలయాలు అక్కడి ప్రజల సంకల్పానుసారం ఏర్పాటు చేయబడుతున్నది.

భారత దేశం వెలుపల అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా సాయి బాబా భక్తులు, ఆరాధనా కార్యక్రమాలు జరుగుతున్నాయి.[27]
షిరిడీలోని సాయిమందిరానికి సగటుమ రోజూ 20 వేల మంది సందర్శకులు వస్తారని. కొన్ని ప్రత్యేక దినాలలో ఈ సంఖ్య లక్షవరకూ ఉంటుందని అంచనా.[28]
మహిమలు[మార్చు]

సాయిబాబా భక్తులు అనుచరులు చెప్పే కధనాల ప్రకారం సాయిబాబా పెక్కు మహిమలు కనబరచాడు. వీటిలో ఎక్కువగా హేమాండ్ పంతు రచించిన ‘సాయి సచ్చరిత్ర’లో ప్రస్తావించబడ్డాయి. దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయడం, ఖండ యోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, గాలిలో తేలి ఉండడం, ప్రకృతి శక్తులను నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాలు తెలిసికోవడం, దూర ప్రాంతాలలోని భక్తులకు తన సందేశం తెలియజేయడం వంటివి ఇలాంటి మహిమలలో కొన్ని.

తన భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా బాబా అనేక భక్తులకు కలలలోను, మనోధ్యాన సమయంలోను దర్శనమిచ్చి మార్గ నిర్దేశనం చేయడం, కష్టాలనుండి విముక్తి కలిగించడం వంటి మహిమలు కనబరచినట్లు పెక్కు భక్తులు చెబుతుంటారు. [29] ఇటువంటి విషయాలు భక్తుల సత్సంగ కార్యక్రమాలలో తరచు చెప్పబడతాయి.
చారిత్రిక ఆధారాలు[మార్చు]

1916లో గోవిందరావు రఘునాధ దభోల్కర్ (ఇతనికి సాయిబాబా ‘హేమాండ్ పంత్’ అనే పేరు పెట్టాడు) మరాఠీలో వ్రాసిన ‘సాయి సచ్చరిత్ర’ అనే గ్రంధం సాయిబాబా జీవిత విశేషాలకు సంబంధించన ముఖ్యమైన ఆధారం. ఈ రచయిత స్వయంగా సాయిబాబా సన్నిహిత అనుచరుడు. ఎక్కువ విషయాలు తను ప్రత్యక్షంగా చూచినవి లేదా బాబా మాటలలో చెప్పినవి లేదా ప్రత్యక్ష సాక్షులు చెప్పినవి వ్రాశాడు. ఈ గ్రంధం దాదాపు అన్ని భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువదించబడింది. తెలుగుగ లో ప్రత్తి నారాయణరావు అనువదించిన ‘సాయి సచ్చరిత్ర’ ఒక నిత్య పారాయణ గ్రంధంగా పెక్కు భక్తులు పరిగణిస్తారు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ వ్రాసిన ‘సాయి చరిత్ర, సందేశం’, స్మృతి శ్రీనివాస్, ఆంటోనియో రిగోపోలస్ వంటి వారు వ్రాసిన సాయిబాబా జీవిత చరిత్రలు వారు విన్న విషయాలపై ఆధారపడినవి. గణేష శ్రీకృష్ణ ఖర్పడే వ్రాసిన ‘షిరిడి దినచర్య’ కూడా ఒక ముఖ్యమైన ఆధారం. తొలి తెలుగు శిరిడీ సాయి చరిత్ర ను (1957) వేమూరి వెంకటేశ్వరరావు గారు వ్రాసినారు. ఇంకా బి.వి.నరసింహస్వామిజీ రచించిన ‘సాయి సందేశం’ కూడా ముఖ్యమైన తెలుగు గ్రంథం.
వివిధ మతాలలో అభిప్రాయాలు[మార్చు]

హిందూమతంలో[మార్చు]
సాయిబాబా జీవితకాలంలోనే యెవాలా ఆనందనాధ్ అనే సాధువు బాబను ఒక ఆధ్యాత్మ వజ్రంగా అభివర్ణించాడు..[30] గంగాగిర్ అనే మరొక సాధువు కూడా ఇదే భావాన్ని వెలిబుచ్చాడు..[30] బాబాను అమితంగా విశ్వసించిన బేడేకర్ మహారాజ్ 1873లో బాబాను దర్శించుకొన్నపుడు ఆయనను జగద్గురు అని సంబోధించాడు.[31][32] టెంబే స్వామీజీ అనబడే వసుదేవానంద సరస్వతి కూడా బాబాను అమితంగా గౌరవించాడు.[33] చాలా మంది శైవ సాధువులు కూడా బాబాను ఆరాధించారు.[34] స్వామి కాళేశ్వర్ బాబాను తన దైవ సమానుడైన గురువుగా పూజించాడు.[35] సత్యసాయిబాబా తనను తాను షిరిడీ సాయిబాబా అవతారమని చెప్పుకొంటున్నాడు.[36]
ఇతర మతాలు[మార్చు]
అధికంగా సూఫీ సంప్రదాయానికి చెందిన మహమ్మదీయులు సాయిబాబాను గురువుగా పరిగణించడం జరుగుతున్నది. మెహెర్ బాబా సాయిబాబాను కుతుబ్ ఎ ఇర్షాద్ (అత్యుత్తమమైన కుతుబ్) అని అభివర్ణించాడు.[37] జోరాస్ట్రియన్ మతానికి చెందిన నానీ ఫాల్కీవాలా, హోమీ భాభా వంటి ప్రముఖులు కూడా సాయిబాబాను విశ్వసించారు.[38]
సంస్కృతిలో
ఒక తివాచీపై అల్లిన బాబా చిత్రం
భారత దేశంలో దాదాపు అన్ని ముఖ్య నగరాలలోను, చాలా పట్టణాలలోను సాయిబాబా మందిరాలున్నాయి.[1] కొన్ని విదేశాలలో కూడా బాబా మందిరాలున్నాయి. ముంబైకు చెందిన షామారావు జయకర్ చిత్రించిన నిలువెత్తు పటం బాబా నివసించిన మసీదులో ఉంది. షిరిడీలోని సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహం ‘తలీమ్’ అనే శిల్పి చెక్కినది.[39] వివిధ బాబా ఆలయాలలోను, సత్సంగాలలోను, కుటుంబ ప్రార్ధనా సమావేశాలలోను బాబా భజన, హారతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి

మంత్రి బాధ్యతలు వహించేది…

నిజానికి పురుషుల్లో కంటే స్త్రీలల్లోనే సమస్యల పట్లా, వాటి పరిష్కారం పట్లా ఏకాగ్రత ఉంటుంది. స్థిరంగా ఆలొచన సాగించే ఓపిక వారి కుంటుంది. బాధల్లో, కష్టాల్లో కొట్టుమిట్టాడే వారి పట్ల జాలి చూపి తక్షణ సాయం అందించేందుకు ముందుకు వచ్చేదీ వారే. కుటుంబ నిర్వహణలో మంత్రి బాధ్యతలు వహించేది మహిళలే కదా…
అందుకే గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర అద్వితీయమని మహాత్మాగాంధీ అంటుండేవారు. ముందుగా మహళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ వారికి సామాజిక సేవ పట్ల అవగాహన కల్పిస్తూ బాధ్యతలను అందిస్తే మహిళలు చేయలేని పనులంటూ లేవు అని గాంధీ అనేక సందర్భాలలో సుస్పష్టం చేశారు. అప్పట్లో మహాత్మాగాంధీ ఏమన్నారంటే… ముందుగా పల్లెసీమల్లో, గ్రామల్లో నివసిస్తున్న మహిళల్లో అక్షరాస్యత పెంచాలన్నారు. అనంతరం వారికి ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించాలని అన్నారు. అలాగే మహిళలకు ఆస్తి హక్కుతో పాటు ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వాలని స్పష్టం చేశారు. మహిళలు స్వీయ వ్యక్తిత్వంతో తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు వీలుగా తగిన వెసులుబాటు కల్పించాలని చెప్పారు. నాటినుంచి ప్రభుత్వాలు మహిళల అభ్యున్నతికి కృషిచేస్తూనే ఉన్నాయి. వారి సమస్యలను పరిష్కరిం చేందుకు ప్రయత్నస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మన రాష్ట్ర ప్రభత్వం ఇటీవల పంచాయతీ ఎన్నకల్లో మహిళలకు ఏభై శాతం సీట్లు కేటాయించడం ముదావహం. ఇవేళ మహిళలు అన్ని రంగాల్లో అద్వితీయమైన ప్రతిభ చూపుతున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, కళాసాంస్కృతిక, వైజ్ఞానిక రంగాల్లో వారు పురుషులతో సమానంగా, కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువగానూ రాణిస్తున్నారు. చట్ట సభల్లో గుర్తించదగిన రీతిలో తమ వాణి వినిపిస్తున్నారు. చట్టసభల్లో స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పదవులు నిర్వహి స్తున్నారు. అంతేకాదు రాష్ట్రపతి పదవిని కూడా చేజిక్కించుకుని చకచక్యంగా న్విహించారంటే మహిళల ధీశక్తిని, సమర్థతనూ అంచనా వేయవచ్చు. మహిళలు పలు రంగాల్లో సాధిస్తున్న ప్రగతికి ఉదాహరణగా ఇందిరాగాంధీ, సరోజినీదేవి, విజయలక్ష్మీపండిత్‌, తెన్నేటి హేమలత, విఎస్‌ రమాదేవి, ప్రతిభాపాటిల్‌, కల్పనాచావ్లా, కిరణ్‌బేడీ, కరణం మల్లీశ్వరి, కోనేరు హంపి, సావిత్రి, జమున ఇలా ఎందరినో చెప్పుకోవచ్చు….
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మహిళలకు కేటాయించిన ఏభైశాతం సీట్లు అందిపుచ్చుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు వచ్చిన తీరు అభినందనీయం. ఈ ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డు సభ్యులుగా అనేక మంది స్త్రీలు పదవులు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాసేవ అందించేందుకు ఉద్యుక్తులవుతున్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయి బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేంద్రం రాష్ట్ర విభజనకు ప్రకటన చేయడం, వెనువెంటనే సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభం కావడం చకచకా జరిగిపోయాయి. ఉద్యమం గత రెండు నెలలుగా రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులూ, వార్డు సభ్యులూ కొంత అసంతృప్తికి లోనైనా రాష్ట్ర విభజన సమస్య ప్రధానమైంది కనుక దానిపై దృష్టి పెట్టారు.
ఈ సమస్య ఇలా ఉంచితే, పంచాయతీల్లో కొత్తగా పదవులు చేపట్టిన మహిళలు సమైక్యాంధ్ర ఉద్యమం అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవ అందించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు తమ వంతు కృషి సాగించేందుకు ఉద్యుక్తులవుతున్నారు. గ్రామ పంచాయతీల పరంగా గాంధీజీ కలలుగన్న విధంగా గ్రామపంచాయతీలను తీర్చిదిద్దేందుకు సమాయత్తమవుతున్నారు.
గాంధీజీ గ్రామాల సౌభాగ్యానికి మరికొన్ని సూచనలు చేశారు. అవేమిటంటే….గ్రామాలలో మత సామరస్యాన్ని పెంపొందించాలన్నారు. పల్లెల్లో పండుగలను, ఇతర వేడుకలను కలసి కట్టుగా నిర్వహించు కోవాలన్నారు. వీటిల్లో అన్ని మతాల వారూ పాల్గొనేలా చూడాలన్నారు. గ్రామీణులు నూలు వడకాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి, ఉద్యోగావకావకాశాలను పెంచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. చేనేత మగ్గాలను అభివృద్ధి చేయడం ద్వారా ఉద్యోగాలను గ్రామాల్లోనే కల్పించుకోవచ్చని సూచించారు. ప్రధానమైన పనులకు గాను యంత్రాలను పరిమితంగా వాడుకోవాలని, ముఖ్యంగా వ్యవసాయం అంతా కూడా మానవశక్తి మీదనే సాగాలన్నారు. బెల్లం తయారీ, కాగితం, నూనె తదితర పనులకు యంత్రాలను ఉపయోగించకుండా చేతితో చేసే విధంగా గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి పనులు ప్రారంభించా లన్నారు. దీని ద్వారా గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు, ఇతరులకు పనులు నిరంతరం లభ్యమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. గాంధీ తన కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ విధంగా చెప్పినప్పటికీ ఈ నాటికీ అవి ఆచరణీయాలుగానే ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన మహిళలు తమ తమ గ్రామాల్లో గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తారని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలనుంచి పంచాయతీలకు రావలసిన నిధులు రాబట్టుకునేందుకు మిగతా నాయకులతో సమైక్యంగా ప్రయత్నిస్తూ, పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి సాధిస్తూ ఇంటిని చక్కదిద్దుకున్నట్లు గ్రామపంచాయతీలను చక్కదిద్దుతారని ఆశిద్దాం…