సర్వభ్రష్టత్వం

న్యాయ వ్యవస్థ ఎప్పుడో భ్రష్ఠుపట్టిపోయింది. ఏదీ ఎక్కడా దొరకదు. న్యాయస్థానంలో న్యాయం, ఆస్పత్రిలో వైద్యం, పాఠశాలలో చదువు, ఆలయంలో ఆధ్యాత్మికత, ప్రభుత్వంలో పాలన, ప్రజాస్వామ్యంలో హక్కులు, కార్యాలయంలో పని, దుకాణంలో సరకు, గ్రంథాలయంలో పుస్తకం, ఊరిలో ఆశ్రయం, ఇంటిలో ఆప్యాయత, బావిలో నీళ్ళు, నాన్నలో ఆదర్శం, అమ్మలో ప్రేమ, సోదరుడిలో సోదరత్వం, స్నేహితునిలో స్నేహం, బంధువులో బంధుత్వం, వగైరా, వగైరా ఏదీ ఎక్కడా లభ్యం కాదు. పూర్వకాలంలో ఏది ఎక్కడ దొరకాలో అది అక్కడ లభించేది. అంతేకాక అదే అన్నిచోట్లా ఉండేది. చాలా కాలం గడిచాక దొరకాల్సిన తావుల్లో కాక మరో చోట దొరికేది. ఇక ఇప్పుడు ఏది ఎక్కడ దొరకాలో అక్కడ కాక, మరో చోట కూడా కాక, కావలసింది అసలు ఎక్కడా దొరక్కుండా పోయే దుస్థితి దాపురించింది.

Leave a comment