ప్రపంచస్థాయి రాజధాని

ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశలో బ్లూప్రింట్‌ను సిద్దం చేసింది. జపాన్‌ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్లూప్రింట్‌లోని కీలక అంశా లను అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించ నున్నారు. ఈ బ్లూప్రింట్‌లో పేర్కొన్న వివరాల ప్రకా రం రాజధాని మహానగరాన్ని మూడంచెల్లో విస్తరించనున్నారు. కోర్‌కేపిటల్‌సిటి, గ్రీన్‌ఫీల్డ్‌సిటీ, మెట్రో పాలిటన్‌ రీజియన్‌గా మూడు భాగాలుగా మహా రాజధాని నగర నిర్మాణాన్ని ప్రభుత్వం విభజిం చింది. ప్రతి అంచెలోనూ ఒక రింగ్‌రోడ్డును నిర్మించనుంది. అంటే రాజధానిలో మూడు రింగ ్‌రోడ్డులు ఉంటాయి. 22 లక్షల ఎకరాల్టో చేపట్టనున్న మెట్రోపాలిటిన్‌ సిటీ చుట్టూ నిర్మించనున్న రింగ్‌రోడ్డు ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. 180 కిలోమీటర్ల పరిధిలో ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం సాగుతుందని, దీనికోసం సుమారుగా 31 వేల కోట్ల రూపాయలు (ఐదు మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) ఖర్చు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇదికాక, మూడంచెల మహారాజధాని ప్రాంతంలో నిర్మాణం కానున్న ఆకాశహర్మ్యాలు, ఎమ్యూజ్‌మెంటు పార్కులు, రోడ్లు, మెట్రో రైళ్లు,తాగునీటి సరఫరా తదితర మౌళికవసతులు, ఇతర సామాజిక సౌకర్యాల కోసం 1.25 లక్షల కోట్ల నుండి రెండు లక్షల కోట్ల రూపాయలు (20 వేల నుండి 30 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల) వరకు పెట్టుబడులు అవసరమవుతాయన్నది ప్రభుత్వ అంచనా!
ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. జపాన్‌ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. రానున్న దశాబ్ధకాలంలో రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు.

Leave a comment