బాబాకు ప్రకృతి నియంత్రణ శక్తి

సాయినాథునికి ప్రకృతిని శాసించగల శక్తి ఉంది. ప్రకృతి అంటే భూమి, నీరు, అగ్నీ, గలి, ఆకాశం లతో కూడుకొని ఉన్నది. ఈ అన్నిటిమీదా ఆయనకు అధికారం ఉంది. ఒకసారి సాయి ఉన్న ప్రాంగణంలో ధునిలోని అగ్ని విజృంభిస్తోంది. అతి శక్తిమంతంగా పైపైకి ఎగసిపడుతోంది. దానినుంచి వస్తున్న వేడి చాలాదూరం వ్యాపిస్తోంది. దీంతో అక్కడి బాబా భక్తులు ఇబ్బంది పడసాగారు. సాయి గమనించి వెంటనే అక్కడ ఉన్న ఒక కర్ర ముక్కనుతీసుకొని స్తంభానికి కొడుతూ – ఆగు, వెంటనే తగ్గిపో….ఆగు, వెంటనే తగ్గిపో…. అంటూ శాసించారు. ఆయన మాటలు పూర్తయిన వెంటనే అగ్నిదేవుడు శాంతించాడు. అలా చూస్తుండగానే అగ్నికీలలు తగ్గిపోయాయి. వేడి ధుని వరకే పరిమితమైంది. అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. బాబా శక్తిని వారు ప్రత్యక్షంగా చూశారు. మనసులోనే బాబాకు జేజేలు పలికారు. అవును మరి సాయిబాబాకు సాధ్యం కానిది ఏమీ లేదు కదా….ఆయన ప్రకృతిని అదుపు చేసే శక్తిమంతుడు…..

సాయినాథుడు – ఖండ యోగం

ఖండ యోగం ప్రపంచంలోనే అత్యద్భుతమైంది. ఈ ప్రక్రియను అరుదుగా ఉంటారు. మన దేశంలో ఆ కాలంలో సాయినాథుడు ఖండ యోగాన్ని అనుసరించేవాడని చెబుతారు. సాయి సూర్యోదయాత్పూర్వమే ఈ ఖండ యోగాన్ని ఆచరించేవాడు. యోగాసనాలు వేసేటపుడు సాధకుని శరీరం వివిధ భాగాలుగా విడిపోవడం ఈ ఖండయోగం ప్రత్యేకత. నిజానికి ఇది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే యోగం. మామూలు యోగాసనాను వేసేటపుడే సాధకుడు చాలా జాగ్రత్తగా ఆసనాలు వేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. మరి ఈ ఖండయోగం లో శరీరమే ముక్కలుముక్కలు అవడం అద్భుతం కాదా…. అందుకనే ప్రపంచంలోనే ఒకరో ఇద్దరో ఖండయోగం వేసేవారట… ఒకసారి శ్రీశిర్డీ సాయినాథుడు ఖండయోగంలో ఉన్నపుడు ఒక వ్యక్తి చూశాడు. బాబా శరీం ముక్కలుగా ఉండడం గమనించి ముందుకు వెళ్లి పరీక్షించాడు. నిజంగా అవి బాబా శరీర భాగాలే అని గుర్తించాడు. ఇంకేముంది… అతను సాయిని ఎవరో కత్తితో నరికివేశారని భావించి, భయంతో అరుస్తూ వీధుల్లో పరిగెట్టాడు. కొద్ది సేపటికి ఊరి జనం అక్కడకు చేరుకున్నారు. అప్పటికి సాయి యోగ ప్రక్రియను ముగించారు. ప్రజలు ఆ వ్యక్తిని తప్పు పట్టారు. అయితే సాయి జరిగిన సంగతి గ్రహించి – ఖండయోగం గురించి వివరించి చెప్పగా అందరూ అమితాశ్చర్యం పొందారు.

సర్వభ్రష్టత్వం

న్యాయ వ్యవస్థ ఎప్పుడో భ్రష్ఠుపట్టిపోయింది. ఏదీ ఎక్కడా దొరకదు. న్యాయస్థానంలో న్యాయం, ఆస్పత్రిలో వైద్యం, పాఠశాలలో చదువు, ఆలయంలో ఆధ్యాత్మికత, ప్రభుత్వంలో పాలన, ప్రజాస్వామ్యంలో హక్కులు, కార్యాలయంలో పని, దుకాణంలో సరకు, గ్రంథాలయంలో పుస్తకం, ఊరిలో ఆశ్రయం, ఇంటిలో ఆప్యాయత, బావిలో నీళ్ళు, నాన్నలో ఆదర్శం, అమ్మలో ప్రేమ, సోదరుడిలో సోదరత్వం, స్నేహితునిలో స్నేహం, బంధువులో బంధుత్వం, వగైరా, వగైరా ఏదీ ఎక్కడా లభ్యం కాదు. పూర్వకాలంలో ఏది ఎక్కడ దొరకాలో అది అక్కడ లభించేది. అంతేకాక అదే అన్నిచోట్లా ఉండేది. చాలా కాలం గడిచాక దొరకాల్సిన తావుల్లో కాక మరో చోట దొరికేది. ఇక ఇప్పుడు ఏది ఎక్కడ దొరకాలో అక్కడ కాక, మరో చోట కూడా కాక, కావలసింది అసలు ఎక్కడా దొరక్కుండా పోయే దుస్థితి దాపురించింది.

ఆనందం ఎక్కడుంది

ఆనందం కోసం ఎక్కడో వెతకవలసిన  లేదు. మనలోనే  ఉంది. మనసులోనే దానిని చూడవచ్చు. అన్నిటికీ మనసే కీలకమయింది. దీనిని  ఎందరో మహానుభావులు రుజువు చేసారు.  మనం చేయవలసిందల్లా మన మనసును మన స్వా ధీనంలో ఉంచుకోవడమే…. అయితే అది అనుకున్నంత తేలిక కాదు.. ఎన్నో కఠోర నియమాలు పాటిస్తే కానీ అది స్వాధీనం కాదు..